Aaditya Thackeray: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం, బీజేపీ ఘన విజయం సాధించడం ఇండియా కూటమిలో ప్రకంపనలకు కారణమైంది. దీనికి తోడు శివసేన ఏక్‌నాథ్ షిండేని, శరద్ పవార్ అవార్డుతో సత్కరించడం కూడా ప్రతిపక్ష కూటమిలో తీవ్ర విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా సత్కరిస్తారని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రశ్నిస్తోంది.
Maharashtra Election Results: మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న పోరులో దక్షిణ ముంబైలోని వర్లీ ఒకటి. ఈ స్థానం నుంచి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో వెనకంజలో ఉన్నారు. శిండే శివసేన నే మిలింద్ దేవరా ఆధిత్యంలో ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఠాక్రే కన్నా కేవలం 600 ఓట్ల మెజారిటీలో దేవరా కొనసాగుతన్నారు. ఇప్పటి వరకు 17 రౌండ్స్‌లో 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు సీఎం ఉద్ధవ్ వర్గం, అటు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు టూరిజం మంత్రి ఆదిత్య ఠాక్రే, రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 20న, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో షిండే డ్రామాలు చేశారని ఆదిత్య…