వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీ వలలో పడ్డాడు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. అనంతరం.. మంగళవారం పక్కా సమాచారంతో.. వనస్థలిపురం కమ్మగూడలోని ఆదిశేషు ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.