టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామందికి తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ తరం అగ్రకథానాయకు లందరి సరసన సుజాత నాయికగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ అభినయించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. సుజాత 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గల్లేలో జన్మించారు. వారి మాతృభాష మళయాళం. ఆమె…