‘అమ్మ’ పాత్రల్లో మేటిగా నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించడం…