(జూన్ 30న అల్లరి నరేశ్ పుట్టినరోజు) మొదట్లో పెన్నూ, పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్షన్ చేయాలి అంటూ ఇ.వి.వి.సత్యనారాయణ చిన్న కొడుకు నరేశ్ ఆరాటపడేవాడు. అయితే అప్పటికే తండ్రి దర్శకత్వం వహించిన ఒకట్రెండు సినిమాల్లో బాలనటునిగా దర్శనమిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం తన పెద్దకొడుకు రాజేశ్ ను హీరోని చేయాలని ఆశించారు. కానీ, తొలుత తెరపై కనిపించిన నరేశ్ నే నటన ఆవహించింది. నటునిగా సక్సెస్ దరి చేరింది. ఈ తరం హీరోల్లో అతివేగంగా యాభై…