ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది.
(అక్టోబర్ 10న ఆలీ పుట్టినరోజు) ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది. పన్నెండేళ్ళ ప్రాయంలోనే నటనలోకి అడుగు పెట్టిన ఆలీ అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన హాస్యంతో గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆలీ నవ్వులు పూయిస్తున్నారు. వందలాది చిత్రాలలో ఆలీ అభినయం జనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికీ…