యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గూర్చి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తారక్ కు ఇండస్ట్రీలోను అభిమానులు ఉన్నారు. తాజాగా హీరో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ను ‘యాక్టింగ్ కింగ్’ అంటూ అభినందించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదలవుతోంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు ‘చోరుడు తో చాట్’ అంటూ ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చారు.…