యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గూర్చి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న తారక్ కు ఇండస్ట్రీలోను అభిమానులు ఉన్నారు. తాజాగా హీరో శ్రీవిష్ణు ఎన్టీఆర్ ను ‘యాక్టింగ్ కింగ్’ అంటూ అభినందించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న ‘రాజ రాజ చోర’ చిత్రం ఈ నెల 19న థియేటర్లో విడుదలవుతోంది. ఈ సందర్బంగా శ్రీవిష్ణు ‘చోరుడు తో చాట్’ అంటూ ట్విట్టర్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇంతలో ఓ అభిమాని ఎన్టీఆర్ గూర్చి ఒక్క మాటలో చెప్పండంటూ కామెంట్స్ చేశారు. శ్రీవిష్ణు సమాధానంగా ‘యాక్టింగ్ కింగ్’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేస్తున్నారు.
ఇటీవలే శ్రీవిష్ణు భిన్నమైన కామిడీ చిత్రాలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ‘రాజ రాజ చోర’ చిత్రం కూడా ఆ నేపథ్యంలో వస్తున్న సినిమానే.. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించగా.. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. హసిత్ గోలి దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాపై చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా వుంది. ‘రాసిపెట్టుకోండి.. ఈ సినిమా అన్ని భాషల వాళ్లు రీమేక్ కోసం అడుగుతారు’ అని శ్రీవిష్ణు నమ్మకంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
One word about @tarak9999
— 𝗦𝗵𝗮𝘀𝗵𝗮𝗻𝗸 𝗧𝗮𝗿𝗮𝗸𝗶𝗮𝗻 🗡️™ (@Shashantarakian) August 18, 2021