పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో సహా సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మరోసారి మందలించింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు ఏం కాదని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23వ…