Earthquake hits Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉత్తరాన అచే ప్రావిన్స్ లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణా నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఇచ్చిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. సునామీ వార్తల నేపథ్యంలో…