కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది.. కేటీఆర్ సెల్ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది.. సెల్ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాకండిగా తేల్చి చెప్పారు.. గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని, ఇప్పుడు కొత్త ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. ఇందుకు సంబంధించి లిఖిత పుర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం పంపాడు.. అయితే సెల్ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు…
Ponguleti Srinivas Reddy : ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల తరువాత నివేదికల…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు.…
BRS Formation Day : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు…
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు.
KTR : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) గురువారం తన నివాసం నుండి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. కేటీఆర్ వెంట ఆయన తరఫు న్యాయవాది రామచంద్రరావు, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కేటీఆర్ తన నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, తనపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలపై ఘాటైన ప్రకటన చేశారు. విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కుమారుడిగా, రాష్ట్ర…
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు. అయితే.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.
నంది నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. కేటీఆర్ ఇంటి వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా నేతలంతా అక్కడకు చేరుకున్నారు.