Delhi Liquor Scam: బాహు’బలి’ మనీష్ సిసోడియా.. ఆప్‌పై బీజేపీ మీమ్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ఆప్‌పై దాడి చేసేందుకు బీజేపీ సరికొత్తగా బాహుబలి చిత్రంలోని కొన్ని క్లిప్‌లను వినియోగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం. అతడిని ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. బాహుబలి చిత్రంలో ఓ చావడిలో గల క్లిప్‌లో కథానాయకుల ముఖాలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముఖాలను కనిపించేలా వీడియో క్లిప్‌ను బీజేపీ రూపొందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. బాహుబలి చిత్రం నుంచి ఒక నిమిషం నిడివి ఉన్న క్లిప్‌లో, మనీష్ సిసోడియా ముఖం ఒక చావడి వద్ద మద్యం అందిస్తున్న వ్యక్తిగా ఆ వీడియోను క్రియేట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అక్కడి వెళ్లి మద్యం అడిగినట్లుగా బాహుబలి చిత్రంలోని వీడియో క్లిప్‌ను సృష్టించారు. ఆ సీన్‌లో సిసోడియా డబ్బు అడుగుతుండగా, కేజ్రీవాల్ మొత్తం చావడి కోసం పానీయాలు కొనడానికి తన వద్ద తగినంత డబ్బు ఉందని చెబుతూ బంగారు నాణేల కుప్పను విసిరేస్తున్నాడు.
Boora Narsaiah Goud: హత్యల్లో తెలంగాణ బీహార్‌ను మించిపోయింది
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఈ వీడియోను లింక్ చేసినట్లుగా క్లిప్‌ను క్రియేట్ చేశారు. క్వాప్షన్‌ను ఇలా రాసుకొచ్చారు. ‘మద్యం కుంభకోణం సూత్రధారి కేజ్రీవాల్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. సిసోడియా తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని, దర్యాప్తు అధికారులకు సహకరించలేదని అరెస్టు అనంతరం సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆప్ ఈ అరెస్ట్‌ను దుష్ట రాజకీయం అని పేర్కొంది. అయితే బీజేపీ ఈ చర్యను ప్రశంసించింది. మనీష్ సిసోడియా మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
“शराब घोटाले के सरग़ना केजरीवाल” की ये फिल्म जरुर देखिये….#ठेकेदार_केजरीवाल_इस्तीफ़ा_दो pic.twitter.com/pqc85DcHB4
— BJP Delhi (@BJP4Delhi) March 1, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!