రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ అభిమానులకు రేపు చాలా ప్రత్యేకమైన రోజు. ఒకవైపు.. దేశం మొత్తం రేపు హోలీ రంగులలో మునిగిపోతుండగా మరోవైపు, ఆమిర్ తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. రేపు అంటే మార్చి 14న అమీర్ పుట్టినరోజు. ఈ నటుడు తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు ముంబైలో అభిమానులు, ఫొటో గ్రాఫర్లతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
(మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టినరోజు)ఆమిర్ ఖాన్ ఏది చేసినా, ఓ నిబద్ధతతో చేస్తారు. అందుకే ఆయనను అందరూ ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’ అని కీర్తిస్తారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, పాటగాడిగా చిత్రసీమలో సాగిన ఆమిర్ బుల్లితెరపై కూడా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమాన్ని నిర్వహించి జనం మదిని దోచారు. ఆమిర్ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తిగా సాగారు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. బుల్లితెరపైనా తన బాణీ పలికించాడు. కొన్ని సందర్భాల్లో…