పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఫరిద్‌కోట్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రతపై ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపై మీడియాతో కలిసి ఆయన గురు గోవింద్‌సింగ్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిని సందర్శించారు.
Aam Aadmi Party: ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రీసెంట్‌గా పంజాబ్‌లోనూ పవర్‌లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్ తెరిచింది.
ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ సాధించినట్లైంది.
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ…
దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను…
పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత జోష్ పెరిగింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతలు పాదయాత్రలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.. మరికొన్ని పాదయాత్రలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు తెలంగాణలో ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని…
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఆప్ రాజకీయ సోపానంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇదే సమయంలో ఇది ఎవరికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అనే చర్చ కూడా మొదలైంది. ఐతే, ఎవరి సంగతి ఎలా ఉన్నా అధికార బీజేపీకి వచ్చే ముప్పు ఉండకపోవచ్చు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఆవిర్భవించాలంటే దాని ఖాతాలో 100 లోక్‌సభ స్థానాలైనా…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘ఆప్’ జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఆప్ దూకుడు ముందు సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం తోకముడవాల్సి వచ్చింది.. సీఎం చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు కూడా ఓటమి తప్పలేదు. అయితే, సిట్టింగ్ సీఎం చన్నీ పోటీ…
ఢిల్లీకి పరిమితం అనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా పంజాబ్‌పై ప్రధానంగా కేంద్రీకరించారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఆప్ ప్రభంజనంలో సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. రాజకీయాల్లో పాతుకుపోయిన నేతలు సైతం ఇంటి బాట పట్టారంటే.. ఆప్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. Read Also: Mayor:…