ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఆరోపించారు.
గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గోపాల్ ఇటాలియాను సూరత్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 'మీ డిగ్రీని చూపించు' ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాజకీయ నాయకులను కూడా అదే చేయాలని కోరింది.
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Ahmadabad : గుజరాత్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలయింది. కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ రికార్డుస్థాయి మెజారిటీని సాధించింది.
AAP became a national party: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చరిత్ర సృష్టించింది. జాతీయ పార్టీ హోదాను సంపాదించుకుంది. గుజరాతీల ఓట్లే ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా మార్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం అన్నారు. ‘‘ గుజరాత్ ప్రజల ఓట్లతోనే నేడు ఆప్ జాతీయపార్టీగా అవతరిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో విద్యా, ఆరోగ్య రాజకీయాలతో ముద్ర వేస్తున్నామని.. ఇందుకు దేశానికి అభినందనలు అని ఆయన అన్నారు. ఆప్…
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ఆద్మీ పార్టీ.. తొలిసారి ఎంసీడీలో పాగా వేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించేలా సీట్లు సాధించింది.. మొత్తం 250 వార్డులకు గాను మేజిక్ ఫిగర్ 126 సీట్లు ఉండగా.. అంతకంటే ఎక్కువగానే అంటే ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది.. ఇక, బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పలేదు.. కేవలం 9…