ఇప్పటికే ఝాన్సీ లక్ష్మీబాయిగా నటించి కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తాజాగా ‘తలైవి’ చిత్రంలో నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత పాత్రను పోషించింది. అలానే ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్ పై ఉంది. మరో రెండు మూడు సినిమాలు వివిధ దశలలో ఉన్నాయి. విశేషం ఏమంటే గత కొంతకాలంగా మహాసాధ్వి సీత పాత్రను కంగనా రనౌత్ పోషించబోతోందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు…