లవ్‌లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్…
జెమినీ సమర్పణలో ఎస్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న సినిమా ‘అమరన్’. ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటిస్తున్న ఈ మూవీతో ఎస్. బలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శనివారం పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్ తో ఈ సినిమా…
‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీరభద్రం దర్శకత్వంలో విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన…