టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నెక్స్ట్ మూవీగా “అతిథి దేవోభవ” అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇందులో నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘బాగుంటుంది నువ్వు నవ్వితే…” అనే రొమాంటిక్ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును దోచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Read also :
1.50 నిమిషాల పాటు సాగిన ఈ టీజర్లో ‘ఈ ప్రపంచంలో ఎవరికైనా మన లోపం గురించి చెప్పుకుంటే… వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోగా… ఆ లోపాన్ని చూసి ఆనందిస్తారని ఆ రోజే నాకు అర్థమైంది” అంటూ మొదలెట్టాడు హీరో. యాక్షన్ సన్నివేశాలతో పాటు లవ్ ట్రాక్ కూడా నడుపుతున్నాడు సాయి. అయితే ఆయనలో ఉన్న లోపం కారణంగా టీజర్ చివర్లో హీరోయిన్ తో ఆయన ప్రవర్తన మరో వేరియేషన్ ను చూపించింది. చివర్లో మాత్రం బుద్ధిమంతుడిలా “రాముడికి లక్ష్మణుడిలా ఈ హీరోకు భయం ఎప్పుడూ వెంటే ఉంటుంది” అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Read Also :
కాగా ఇప్పటికే “అతిథి దేవోభవ” షూటింగ్ మొత్తం పూర్తయింది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాక్-టు-బ్యాక్ సరికొత్త జోనర్లలో సినిమాలు చేస్తున్న ఆది ఎక్కువగా ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కిట్టిలో బ్లాక్, అమరన్, కిరాతక, అతిథి దేవోభవ సినిమాలు ఉన్నాయి. చాలాకాలంగా హిట్ అనే మాటకు దూరమైన ఆది మరి ఇందులో ఏ సినిమాతో హిట్ అందుకుంటాడో చూడాలి.