ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో దసరా రోజున జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తు అజయ్ శ్రీనివాస్ దీనిని నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సీనియర్ నిర్మాతలు కె. యస్. రామారావు , సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్, పుస్కర రామ్మోహన రావు ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్భంగా నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”మా నాన్న శాంతయ్య గత 32 సంవత్సరాలుగా డిస్ట్రి బ్యూషన్ రంగంలో ఉన్నారు. కారంచేడు మా స్వగ్రామం . రామానాయుడుగారి స్ఫూర్తి తో ఇండస్ట్రీ కి వచ్చిన మా నాన్నగారు నేను నిర్మాతగా మారడానికి ప్రోత్సాహం అందించారు. దేవ్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ కథ పై ఒక సంవత్సర కాలంగా పనిచేశాం. ఆది సాయికుమార్ కెరియర్ లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడు దేవ్ చాలా టాలెంటెడ్ పర్శన్. నవంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం” అని అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ, ”దర్శకుడు దేవ్ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని అన్నారు. ఆలి రాజా మాట్లాడుతూ, ”ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. నా కెరీర్ లో ఇదో మంచి పాత్రగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. ఇందులో తానో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు తారక్ పొన్నప్ప చెప్పాడు. నందినీరాయ్ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు మాటలు సాయినాథ్, సంగీతం అనీశ్ సోలోమాన్ సమకూర్చతున్నారు.