యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆది నెక్స్ట్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేశారు. “అతిథి దేవోభవ” షూటింగ్ మొత్తం పూర్తయింది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Read also : ఉప్పలపాటి ప్రభాస్ జగమంత కుటుంబం
శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్రీజి బెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘బాగుంటుంది’ అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కకూడా వీక్షించండి.