యువ నటుడు ఆది సాయికుమార్ తాజాగా చిత్రాన్ని నిన్న మేకర్స్ లాంఛనప్రాయంగా హైదరాబాద్‌లో పూజా వేడుకలతో ప్రారంభించారు. ఆది సాయికుమార్ తో ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ జోడి కట్టనుంది. పాయల్, ఇతర టీమ్ సభ్యులు లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీకి “టిఎంకె” అని పేరు పెట్టారు. “టిఎంకె”లో ఆది సాయికుమార్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఫేమ్ కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, విజన్ సినిమాస్ పతాకంపై వ్యాపారవేత్త నాగం తిరుపతి నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, పూర్ణ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : షాకింగ్ : “పుష్ప” మరో లీక్… వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే!!
మరోవైపు పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం “ఏంజెల్”లో నటిస్తోంది. కెఎస్ అధియామన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓఎస్టి ఫిల్మ్స్ బ్యానర్ కింద రామ శరవణన్ నిర్మిస్తున్నారు. సంగీతం డి ఇమ్మాన్ అందిస్తున్నారు. మరోవైపు ఆది సాయి కుమార్ “కిరాతక”, “అమరన్: చాప్టర్ 1”, “బ్లాక్” వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.