Special Story on Teacher's Day: ఈ రోజు సెప్టెంబర్ 5. టీచర్స్ డే. టీచ్ అంటే బోధించటం (లేదా) నేర్పటం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతిఒక్కరూ టీచర్లే. పుట్టిన దగ్గరి నుంచి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. ఆ క్రమంలో మనకు ఎందరో టీచర్లు. ప్రతి వ్యక్తి జీవితమూ పలువురితో ముడిపడి ఉంటుంది. అందుకే ఏడాదిలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతోంది.