మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు.