Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్…