తెలుగు వారి ఆహ్లాద రచయిత మల్లాది రాసిన 'రేపటి కొడుకు' నాలుగు దశాబ్దాల క్రితం హిందీలో 'కువారి బహు'గా రూపుదిద్దుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన రాసిన 'అందమైన జీవితం' నవల హిందీలో '8 ఎ. ఎం. మెట్రో'గా వచ్చింది.
'మల్లేశం' చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం '8 ఎ.ఎం. మెట్రో'. ఈ సినిమా పోస్టర్ ను లెజండరీ పొయిట్ గుల్జార్ విడుదల చేశారు. ఆయన రాసిన ఆరు కవితలూ ఈ చిత్రంలో చోటు చేసుకోవడం విశేషం.