సినీప్రియులు నచ్చి, మెచ్చి మరీ మరీ చూసిన చిత్రాలు అనేకం. వాటిలో 1972లో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ మరపురానిది. మరువలేనిది. మరచిపోకూడనిది అని చెప్పవచ్చు. 1930లలో మాటలు విరివిగా విసరడం మొదలెట్టిన సినిమాకు తొలుత జాన్ ఫోర్డ్ రూపొందించిన వెస్ట్రన్స్, ఫ్యామిలీ డ్రామాస్ పెద్ద బాలశిక్షగా పనిచేశాయి. 1941 తరువాత ఎందరో సినీ ఫ్యాన్స్ తాము ఆర్సన్ వేల్స్ రూపొందించిన ‘సిటిజెన్ కేన్’ చూసి స్ఫూర్తి చెందామని అంటారు. ఆ తరువాత ఆ స్థాయిలో సినీ…