ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఎప్పుడో చేస్తారో కూడా ఈ ఆన్ లైన్ సంస్థలు చెబుతాయి. ఇంకా.. ఆన్ లైన్ ట్రాకింగ్ లాంటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతమైతే ఈ-కామర్స్ సంస్థలు దాదాపు వారం, పది రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే.. విచిత్రంగా ఓ వ్యక్తి ఓ వస్తువును ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు ఓ ఈ కామర్స్ సంస్థ డెలివరీ చేసింది.