దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న సింగరేణి కాలరీస్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదా? నల్లబంగారం అందించే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం విస్మయం కలిగిస్తోంది. దీంతో సింగరేణిలో ఏం జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాసిపేట మండలం కల్యాణి ఖని ఉపరితల బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. షవర్ ఆపరేటర్ మట్టి పోస్తుండగా మట్టి కుప్ప కింద…