వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు.