అనంతపురం జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డ్ సాధించారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం వాట్సప్ ఫిర్యాదుతో ఏకంగా 3 వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనంతపురం జిల్లా పోలీసులు ఒక వినూత్న సర్వీస్ కు శ్రీకారం చుట్టారు. చోరీకి గురైన ఫోన్లు, లేదా పొగుట్టుకున్న ఫోన్ల కోసం చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవారు. ఫిర్యాదు చేసినా అవి ట్రేస్ కాక ఇబ్బంది పడే…