ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయంలో వైసీపీ నేతలు పూర్తి స్థాయి మైండ్‌సెట్ మార్చుకున్నారా అంటే..... అవును, వాళ్ళ తాజా మాటలు అదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులైతే... మూడు రాజధానుల మూడ్ నుంచి పూర్తిగా బయటికి రావడమే కాకుండా..... అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.
మూడు రాజధానులు, అమరావతి అంశంపై హైకోర్ట్ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఇప్పటికే రాజకీయపార్టీలు స్పందించాయి. తీర్పుని స్వాగతించారు సీపీఐ నేత రామకృష్ణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల స్పందించారు. రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ముందు నుంచి టీడీపీ మూడు రాజధానుల బిల్లు చెల్లదని చెబుతూనే ఉంది.వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళింది. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 3 నెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి…