Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాదుల కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్-కెనెడియన్ తహవూర్ రాణా విచారణ ప్రారంభమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి రోజు విచారణకు రాణా పెద్దగా సహకరించలేదని, పరిమిత సమాచారాన్ని అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు, ఉగ్రవాది అయిన పాక్-కెనెడియన్ తహవూర్ రాణాని భారత అధికారులు గురువారం అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా న్యాయస్థానాల్లో భారత్‌కి అప్పగించకుండా ఉండేందుకు అన్ని న్యాయ సదుపాయాలను రాణా ఉపయోగించుకున్నాడు.
Tahawwur Rana: 26/11 నిందితుడు, ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణా ఇండియాకు చేరుకున్నాడు. అమెరికా అత్యున్నత న్యాయస్థానాలు ఇండియాకు అప్పగించేందుకు అనుమతించడంతో, ఇతడిని భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది కావడంతో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలెం ఎయిర్ పోర్టు నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది.
Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు.
26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితులో్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.
26/11 Mumbai Terror Attacks: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని అమెరికా, భారత్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా కోర్టు 30 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 2008లో లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా వ్యక్తి తహవుర్ రాణా కీలక నిందితుడి ఉన్నాడు. ఇతడిపై అమెరికా న్యాయస్థానం విచారణ చేస్తోంది. ప్రస్తుతం జైలులో ఉన్న వ్యాపారవేత్త తహవుర్ రాణా దాఖలు చేసిన స్టేటస్ కాన్ఫరెన్స్ మోషన్‌ను అమెరికా…
26/11 Mumbai Terror Attacks - UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.…