Home
2029 Elections
2029 Elections News
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
L Murugan Resigns: కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి ఎల్. మురుగన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీకి ఎల్ మురుగన్ లేఖ రాశారు. తన భవిష్యత్ కార్యాచరణను వివరించారు. తాను ఇప్పుడు పూర్తి సమాయాన్ని తమిళనాడులో బీజేపీ బలోపేతానికి, 2029 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి కేటాయించాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని… -
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 2029లో రాహుల్ గాంధీ ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈవీఎంలే తమ ఓటమికి కారణమని చెబుతున్నాయని, గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లో జరిగిన కాంగ్రెస్ గెలవలేదని అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ చెబుతున్నవి అన్నీ అబద్ధాలే అని తేలిందని అమిత్ షా అన్నారు. త్రిపుర, బెంగాల్, గుజరాత్ వంటి… -
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
Bolishetti Srinivas: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీ భవిష్యత్ వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంబేద్కర్… -
CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ప్రజా చైతన్య కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారంపై ఆయన నేతలకు కీలక సూచనలు చేశారు. రేపటి నుంచి 45 రోజుల పాటు టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు వివరించాలని సీఎం నేతలకు… -
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
Delimitation Bill: దేశ రాజకీయాలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత పేకమేడలా కూలిపోతోంది. ఇండియా కూటమికి మిత్రపక్షాలు షాక్ ఇస్తున్నాయి. ఇక ఇన్నాళ్లు బీజేపీని ఎదురించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం, మమతా బెనర్జీ ఘోర పరాజయం, డీఎంకే ఓటమి ఇలా అన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరగడం బీజేపీకి ప్లస్‌గా మారబోతోంది. డీలిమిటేషన్ బిల్లు, 2026 ఆమోదం కోసం ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతోంది.… -
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
Delimitation: నియోజకవర్గా పునర్విభజనపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. డీలిమిటేషన్ కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. దీని కోసం ఒక కొత్త బిల్లును తీసుకువచ్చే అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దశాబ్ధాల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుంది. భారత రాజకీయ మ్యాప్ మారుతుంది. మారనున్న పొలిటికల్ మ్యాప్: పలు పార్టీల… -
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
BJP: భారతదేశంలో బీజేపీ హవా 20 ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ పోల్స్టర్, యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే వారి సామర్థ్యంపై ఇది ఆధారపడుతుందని చెప్పారు. బీజేపీ పాలన పనితీరు గణనీయంగా బలహీనపడనంత కాలం ఆ పార్టీ స్థానం సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ అనుభవించిన సుదీర్ఘ ఆధిపత్యాన్ని, ఇప్పుడు బీజేపీ అనుభవిస్తోందని చెప్పారు. భారతదేశంలో ఏక-పార్టీ ఆధిపత్య పరిస్థితులను చూస్తున్నామని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… -
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తానని భ్రమపడుతున్నారని, కానీ తెలంగాణలో ఆ కుటుంబం శకం శాశ్వతంగా ముగిసిపోయిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఎలాగైతే తిరస్కరించారో, 2029… -
Modugula Venugopala Reddy: 2029 ఎన్నికలలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాషే!
వైసీపీని ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడని జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ ప్రశంసించారు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాషే అని పేర్కొన్నారు. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు, పార్టీకి కొండంత అండ అని చెప్పారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మోదుగుల అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ కోడ్ ద్వారా… -
Asaduddin Owaisi: ‘‘2029 ఎన్నికల వరకైనా పూర్తవుతుందా.?’’ కులగణనపై ఓవైసీ..
Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!