Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bolishetti Srinivas: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు సామాజిక వర్గం, జనసేన పార్టీ భవిష్యత్ వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన అమలాపురం పార్లమెంట్ జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు లేని రాజకీయాలు లేవని, పవన్ కల్యాణ్ లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవని అన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వం వల్లే కాపు సామాజిక వర్గానికి విలువ పెరిగిందని పేర్కొన్నారు. కోనసీమలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నందున వారిని కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అమలాపురంలో కులాల పేరుతో విభజనలు సృష్టించారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2029 ఎన్నికల నాటికి జనసేన బలాన్ని 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం అయితేనే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుకొమ్మల్లాంటివని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?