Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
- భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్రం..
- నియోజకవర్గాల పునర్విభజనపై ఫోకస్..
- రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం కోసం చర్చలు..
- 2029 లోక్‌సభ ఎన్నికల ముందే బిల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation: నియోజకవర్గా పునర్విభజనపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. డీలిమిటేషన్ కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. దీని కోసం ఒక కొత్త బిల్లును తీసుకువచ్చే అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దశాబ్ధాల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుంది. భారత రాజకీయ మ్యాప్ మారుతుంది.
మారనున్న పొలిటికల్ మ్యాప్:
పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ స్థానాల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ అమలులోకి వస్తే రాష్ట్రాలలోని ఎంపీ సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
అయితే, డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, ఒక ఫార్ములా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో తొలి దశ చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. అన్ని పార్టీలతో సంప్రదింపులు పూర్తయ్యాక డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!