Rajnath Singh: ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు.
Telangana : తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల సామగ్రిని రెడీ చేసుకోవాలని చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల సంఖ్యను నిర్ణయించింది. జడ్పీపీలు – 31, జడ్పీటీసీలు – 566, ఎంపీపీలు…
టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.