2022 Filmy Rewind: నలుపు వెనుకే తెలుపు... చీకటి వెనుకే వెలుగు అన్నట్టుగా ఈ యేడాదీ చిత్రసీమ విషాద వినోదాల కలబోతను తలపించింది. ఆగని కాల ప్రవాహంలో 2022 కీలక సంఘటనలకు, విశేష సందర్భాలకు సాక్షిభూతంగా నిలిచింది. తేదీల వారిగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.
తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు.
2022 Filmy Rewind: సినిమా నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం. కొత్త వారిని నమ్మి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే మాటలు కాదు. కానీ చిత్రంగా తెలుగులో ప్రతి యేడాది నలభై, యాభై మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు.