తెలంగాణలో కరెంట్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లు(వార్షిక ఆదాయ అవసరాలు) ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. విద్యుత్ డిస్కంలు 2021-22, 2022-23 సంవత్సరాలలో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఏఆర్ఆర్ ప్రతిపాదనలను మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ సందర్భంగా తాము రూ.21,550 కోట్ల రెవెన్యూ లోటును కలిగి ఉన్నామని.. దీనిని పూడ్చాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని ప్రతిపాదనల్లో డిస్కంలు స్పష్టం చేశాయి. 2021-22 కాలానికి రూ.45,618 కోట్ల లోటు, 2022-23 కాలానికి…