ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సమయంలో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది ఐవోసీ. అయితే కొవిడ్ నిబంధనలో భాగంగా అథ్లెట్లు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పతకాలు అందుకుంటున్న సమయంలోనూ మాస్క్ ధరిస్తుండటంతో విజేతల ముఖాల్లో ఆనందాన్ని కెమెరాలు బంధించలేకపోతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఐవోసీ.. నిబంధనలో చిన్న సవరణ చేసింది. క్రీడాకారులు 30 సెకన్లు మాస్క్ తీయడానికి…
టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉండగా, పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపారు. మిగతా వారిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు. గత నెలలో జపాన్ చేరుకున్న ఉగాండా జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు కూడా కరోనా…
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.