అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తమైంది. మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు.. నిందితుడిని చాకచాక్యంగా పట్టుకున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది.