పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక నూతన దంపతులు రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు.. అత్తింటిలో అడుగుపెట్టిన దగ్గర అందరినీ మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజు సాయంత్రం అందరికీ టీ అందించింది. కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు.