భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ కు ఒక లేఖ అందింది. ఈ లేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ రాశారు. బంగ్లాదేశ్ మార్చి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా…
Bangladesh-Pakistan: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు ఒక కార్గో షిప్ వెళ్లింది. ఇది పాక్-బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది. ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ "ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగు"గా అభివర్ణించింది, ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.