రాజస్థాన్‌లో జైపూర్ జిల్లాలోని చౌము పట్టణంలో 12వ తరగతి విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లి మందలించడంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. అతను తన స్టడీ సర్టిఫికేట్లను తన బ్యాగ్‌లో ఉంచుకున్నాడు. ఇంట్లో నుంచి రూ.రెండు వేల నగదు చోరీ చేసి తల్లి చూడకముందే ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.