మహిళకు దేశంలో అత్యున్నత పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సిద్ధం కావడంతో ప్రత్యర్థి శిబిరంలో బీటలు వారింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పలు ప్రాంతీయ పార్టీలు ద్రౌపది ముర్ముకు తమ మద్దతు ప్రకటించాయి.
Draupadi Murmu As 15th President: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము ఘన విజయం సాధించారు. ప్రపంచంలోొ అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. మూడు రౌండ్లు జరిగే సరికే ద్రౌపది ముర్ము సగానికి పైగా ఓట్లు సాధించారు. ఇంకో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే రాష్ట్రపతిగా గెలుపొందారు. మూడు రౌండ్లు ముగిసే సరికి ద్రౌపది ముర్ము…