Tele MANAS: మానసిక ఆరోగ్య సహాయ కేంద్రమైన ‘టెలీ మానస్’ కాల్ సెంటర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన వినూత్న ప్రయత్నాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ద్రాక్ష రవిశ్రీ అనే నాలుగేళ్ల చిన్నారి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో చేసిన వేషాధారణకు మంత్రి ప్రశంసలు దక్కాయి. మంగళవారం జరిగిన ఫ్యాన్సీ డ్రస్ పోటీలలో చిన్నారి రవిశ్రీ తండ్రి కల్పించిన అవగాహనతో ‘టెలీ మానస్’…