ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే టన్నెల్‌లో మట్టి తొలగిస్తేనే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ముమ్మరంగా కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 11 వ రోజు కొనసాగనున్నాయి. అయితే, నేడు సభ ముందుకు కీలక బిల్లులు వెళ్లనున్నాయి. లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ ప్రారంభించనున్నారు.
నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది.