ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 11 వ రోజు కొనసాగనున్నాయి. అయితే, నేడు సభ ముందుకు కీలక బిల్లులు వెళ్లనున్నాయి. లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ ప్రారంభించనున్నారు. అయితే, బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కొత్త పేర్లు.. ఐపీసీ ( ఇండియన్ పీనల్ కోడ్)కు భారత న్యాయ సంహితగా పేరు మార్చారు. అలాగే, సీఆర్పీసీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్)కు భారత నాగరిక సురక్ష సంహిత అని.. ఎవిడెన్స్ యాక్ట్ కు భారత సాక్షి చట్టంగా కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు చేశారు. కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉంది.
Read Also: Lokesh Kanagaraj: రజినీ సినిమాపై దృష్టి పెట్టకుండా ఇవేమి పనులు సార్?
పార్లమెంట్ భద్రత వైఫల్య ఘటనపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హోoమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి నేతలు చర్చించుకోనున్నారు.