తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 10 వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ లో చదివేందుకు అప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు కూడా. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీటు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాలీసెట్ ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో వచ్చే ర్యాంకును బట్టి వివిధ కళాశాలలో విద్యార్థులకు సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఇక పాలిసెట్ లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
కొంతమందికి చదువుకోవాలని అమిత ఆసక్తి ఉన్న వారి కుటుంబ సమస్యల కారణంగానో, లేకపోతే ఇతర సమస్యల కారణంగానో చదువు దూరం అవుతుంటారు. వారి సమస్యల వల్ల చదువు మధ్యలోనే వదిలేసి ఇతర ఆదాయ మార్గాల వైపు పయనిస్తుంటారు. చాలామంది మహిళలు వారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్న కానీ.. వారికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, లేకపోతే డబ్బు సంపాదనకు పనులలో చేర్చడం లాంటి విషయాల ద్వారా చాలామంది చదువుకోవడం కొనసాగించలేకపోయారు. అచ్చం అలాంటి సంఘటన ప్రస్తుతం కర్ణాటక…
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఎక్సామ్స్ రాయనున్నాయి.
ఏపీలో పదవతరగతి పరీక్షా ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలా జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదవతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇంట్లో తల్లితండ్రులదే తప్పు అని నెపం వేస్తారా? అని ఆయన అన్నారు. 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి.. ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకీ ఫీజులు తీసుకోకూడదు. పట్టుమని…
ఈ రోజు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు జూన్ 1 వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది 5 లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్ష…
ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861…
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో..…
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరీక్షలు ఎప్పుడు పెడతామనేది సరైన సమయంలో చెబుతామన్నారు. నారా లోకేష్ కు దొరికినట్టు అందరికీ సత్యం రామలింగరాజులు…
కరోనా వైరస్‌తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని…