కొంతమందికి చదువుకోవాలని అమిత ఆసక్తి ఉన్న వారి కుటుంబ సమస్యల కారణంగానో, లేకపోతే ఇతర సమస్యల కారణంగానో చదువు దూరం అవుతుంటారు. వారి సమస్యల వల్ల చదువు మధ్యలోనే వదిలేసి ఇతర ఆదాయ మార్గాల వైపు పయనిస్తుంటారు. చాలామంది మహిళలు వారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్న కానీ.. వారికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, లేకపోతే డబ్బు సంపాదనకు పనులలో చేర్చడం లాంటి విషయాల ద్వారా చాలామంది చదువుకోవడం కొనసాగించలేకపోయారు. అచ్చం అలాంటి సంఘటన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తల్లి కుమారుడు కలిసి ఒకేసారి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Also Read: Prakash Raj Birthday: సినిమాలు, రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా సాగర గ్రామానికి చెందిన గంగమ్మ అనే మహిళ తన కొడుకుతో కలిసి 32 ఏళ్ల వయసులో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యింది. ప్రస్తుతం సదర మహిళా సహాయక సంఘంలో వాలంటరీగా పనిచేస్తుంది. అయితే ఆమె భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకోవడం., అందుకోసం పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం వల్ల తన పదవ తరగతి పరీక్షలకు కొడుకుతో సహా పరీక్షలు రాయడానికి హాజరు అయ్యింది. ఇక గంగమ్మ కుమారుడు మల్లికార్జున శివన్న కూడా ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నాడు. కర్ణాటకలో సోమవారం నుండి పరీక్షలు మొదలవగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read: Viral Video: అతి చేయొచ్చు కానీ.. మరి మితిమీరకూడదు..ఒకవేళ చేస్తే ఇలాగే ఉంటాది కాబోలు..!
ఈ సందర్భంగా గంగమ్మ మాట్లాడుతూ.. తాను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నానని ఆ తర్వాత పెళ్లి కావడంతో స్కూల్ కి వెళ్ళిన కొన్ని కారణాలవల్ల చదవడం మానేశానని చెప్పుకొచ్చింది. తాను వాలంటరీగా పనిచేస్తున్నానని.. పదవ తరగతి సర్టిఫికెట్ కోసం ఇప్పుడు పరీక్షలు రాస్తున్నట్లు ఆవిడ తెలిపింది.