దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు…
దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌లను వేయించుకున్నారు. భారత్‌లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన…